రీసెంట్గానే పొన్నియిన్ సెల్వన్ ఆడియో లాంచ్ అయ్యింది. ఈ సినిమాలోని అన్ని పాటలు కూడా ఇప్పుడు అన్ని మ్యూజిక్ యాప్స్ లో లభ్యమవుతున్నాయి. ఐతే ఈ సినిమా నుండి థర్డ్ లిరికల్ సాంగ్ "రాచ్చస మావయ్య" ను ఈ రోజు సాయంత్రం ఆరింటికి విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు.
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్త బ్యానర్ లపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఇటీవలే ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల నుండి విశేష స్పందన అందుకుంది.
చియాన్ విక్రమ్ ,ఐశ్వర్యారాయ్ బచ్చన్ , కార్తీ, త్రిష, జయం రవి, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa