ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లూరి నుండి హార్ట్ టచింగ్ బ్రేకప్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 04:47 PM

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, శాండల్ వుడ్ హీరోయిన్ కయదు లోహర్ జంటగా నటించిన చిత్రం "అల్లూరి". శ్రీవిష్ణు ఈ సినిమాలో ఫెరోషియస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ పవర్ఫుల్ కాప్ గా శ్రీవిష్ణు అద్భుతమైన నటనను ప్రేక్షకులకు కనబరిస్తే, లేటెస్ట్ గా విడుదలైన వేదనే ఆవేదనే అనే లిరికల్ సాంగ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఉండే స్ట్రాంగ్ లవ్ ట్రాక్ ను చూపిస్తుంది. ఈ పాటను శ్రీనిషా జయశీలన్ ఆలపించగా, రాంబాబు గోశాల సాహిత్యం అందించారు.
లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించగా, ప్రదీప్ వర్మ డైరెక్ట్ చేసారు. హర్షవర్ధన్ రామేశ్వరన్ సంగీతం అందించారు. తనికెళ్ళ భరణి, సుమన్, రాజారవీంద్ర, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa