హను రాఘవపూడి డైరెక్షన్లో ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందిన 'సీతారామం' సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. రష్మిక మండన్నా కీరోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మురళీశర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
ఆగస్టు ఐదవ తేదీన తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెల దాటిపోతున్నా బాక్సాఫీస్ వద్ద ఇంకా మంచి నంబర్లను రాబడుతోంది. లేటెస్ట్ గా మేకర్స్ ఈ సినిమా నుండి కానున్న కళ్యాణం అనే అందమైన డ్యూయెట్ సాంగ్ ను ఫుల్ వీడియో రూపంలో విడుదల చేసారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సింధూరి ఆలపించగా, లేట్ లెజెండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యమందించారు. విశాల్ చంద్ర శేఖర్ అద్భుతంగా స్వరపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa