కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 169వ చిత్రం "జైలర్". నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ మూవీ నిన్నటిమొన్నటి వరకు హైదరాబాద్ లో లాంగ్ షెడ్యూల్ ను జరుపుకుంది.
లేటెస్ట్ గా జైలర్ షూటింగ్ చెన్నైలోని ఆదిత్యారామ్ స్టూడియోస్ లో జరుగుతుంది. విశేషమేంటంటే, ఆ స్టూడియోస్ లోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ "జవాన్" మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు సూపర్ స్టార్లు కలుసుకుని కొంచెంసేపు కబుర్లు చెప్పుకుని, ఆపై ఎవరి షూటింగ్ తో వాళ్లు బిజీగా మారిపోయారట.
జవాన్ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa