బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం "స్వాతిముత్యం". ఈ సినిమాతోనే గణేష్ సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడిగా, బెల్లంకొండ సురేష్ తనయుడిగా గణేష్ వెండితెరకు పరిచయం కాబోతున్నారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గణేష్ కు స్వాతిముత్యం మేకర్స్ చిన్న బర్త్ డే సర్ప్రైజ్ ప్లాన్ చేసారు. స్వాతిముత్యం టీజర్ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 04:05గంటలకు విడుదల చెయ్యబోతున్నారు.
లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పోతే, ఈ చిత్రం అక్టోబర్ ఐదవ తేదీన ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa