అక్కినేని నాగార్జున... ఒకవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెర షోలతో బిజీగా గడుపుతున్న సీనియర్ స్టార్ హీరో. ఈ ఏడాది నాగార్జున నుండి బంగార్రాజు సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది.
ఆ తరువాత బిగ్ బాస్ నాన్ స్టాప్, బ్రహ్మాస్త్ర, ది ఘోస్ట్ సినిమాల షూటింగులతో బిజీగా గడిపారు. లేటెస్ట్ గా "బిగ్ బాస్ 6" కూడా పట్టాలెక్కేసింది. దీనికి కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
బ్రహ్మాస్త్ర సినిమా ఇటీవలే విడుదలైంది... ది ఘోస్ట్ అక్టోబర్ ఐదవ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది... బిగ్ బాస్ 6 తదుపరి మూడు నెలల లాంగ్ బ్రేక్ తీసుకుని నాగ్ రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారట. అంటే, వచ్చే ఏడాదే నాగ్ మళ్ళీ సెట్స్ లో కనబడేది.