ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సేమ్ జోనర్ లో మూడో సినిమా తీస్తానంటున్న ఇంద్రగంటి

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 07:06 PM

మోహన కృష్ణ ఇంద్రగంటి - సుధీర్ బాబు కలయికలో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" అనే సరికొత్త కాన్సెప్ట్ తో కూడిన సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
అంతకుముందు ఇదే కాంబినేషన్లో సమ్మోహనం అనే సినిమా వచ్చింది. 2018లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. సమ్మోహనం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ... ఈ రెండు సినిమాల నేపధ్యం కూడా ఒకటే. సినిమా, సినిమా ఇండస్ట్రీ, నటీనటులు... అంటూ మొత్తం సినీనేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు. ఈ నేపథ్యంలో మూడో సినిమాను కూడా తీసి, ట్రైయాలజిని పూర్తి చేసి తన కోరికను ఫుల్ ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నారట.
పోతే, కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఈ శుక్రవారం థియేటర్లకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com