బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయనున్నారు. "ఆదిపురుష్" సినిమా జనవరి 12, 2023న గ్రాండ్‌గా విడుదల కానుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా టీజర్‌ని దసరా సందర్భంగా అక్టోబరు 3న విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుండి వెలువడనుంది. T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 400 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది అని మేకర్స్ వెల్లడించారు.