అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమా 'ది ఘోస్ట్'. ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయినిగా నటించింది. తాజాగా సెప్టెంబర్ 16న ఈ సినిమా నుండి 'వేగం' అనే మొదటి పాటని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా అక్టోబరు 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించాయి.