హీరో ధనుష్ నటించిన 'నానే వరువేన్' సినిమాను తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. తమిళంలో చేసిన సినిమాను ఈ నెలలోనే అక్కడ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా అదే రోజున తెలుగులోనూ రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'నేనే వస్తున్నా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.