కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "నేను మీకు బాగా కావాల్సినవాడిని". శ్రీధర్ గాదె ఈ సినిమాకు దర్శకుడు కాగా లేట్ లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి కూతురు దివ్య నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీ నుండి లేటెస్ట్ గా లాయర్ పాప్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాటను రామ్ మిరియాల ఆలపించగా, భాస్కర భట్ల సాహిత్యమందించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మగారు సంగీతం అందించారు.
కిరణ్ అబ్బవరం, శ్రీధర్ గాదె ల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం "SR కళ్యాణమండపం" ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తిరిగి అదే కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.