ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ శుక్రవారం నుండి ఆహాలో విష్ణు మంచు "మోసగాళ్ళు"

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 11:48 PM

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ లీడ్ రోల్స్ లో అమెరికన్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కించిన చిత్రం "మోసగాళ్ళు". గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రమే విష్ణు కెరీర్ లో తొలి పాన్ ఇండియా ఫిలిం. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్ కీలక పాత్రలు పోషించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా లేటెస్ట్ గా ఈ శుక్రవారం నుండి అంటే సెప్టెంబర్ 16 నుండి తెలుగు ఓటిటి ఆహాలో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయంపై సదరు ఓటిటి సంస్థ అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త సంస్థలపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com