ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బింబిసార, కార్తికేయ 2 డైరెక్టర్ల చేతులమీదుగా లెహరాయి టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 11:46 PM

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "బింబిసార" చిత్రం ఇటీవల విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలానే రీసెంట్గానే విడుదలైన కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో ప్రభంజనం సృష్టిస్తుంది.
ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తమవైపుకు ఆకర్షించుకున్న డైరెక్టర్లు వశిష్ట, చందూ మొండేటి చేతుల మీదుగా కొత్త సినిమా "లెహరాయి" టీజర్ రేపు ఉదయం పదకొండు గంటలకు విడుదల కాబోతుంది.
ఈ సినిమాలో రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాతో రామకృష్ణ పరమహంస టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో, మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com