"లైక్ షేర్ సబ్స్క్రైబ్" మూవీ నుండి ఒక్కో ఇంపార్టెంట్ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్ విడుదల అవుతూ వస్తున్నాయి. హీరో సంతోష్ శోభన్ తో మొదలైన ఈ క్యారెక్టర్స్ పోస్టర్స్ రిలీజ్ తదుపరి హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, ఆపై కమెడియన్ నెల్లూరు సుదర్శన్ ల వరకు కొనసాగింది.
లేటెస్ట్ గా ఈ సినిమాలో మరొక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న బ్రహ్మజీ ఫస్ట్ లుక్ రివీల్ అయ్యింది. వైల్డ్, వయోలెంట్, బ్రూటల్ గా ఉండే "బ్రహ్మన్న" రోల్ లో బ్రహ్మాజీగారు నటిస్తున్నారు. సినిమాలో ఈ పాత్రను పట్టుకున్నవారికి పదిలక్షల నజరానా కూడా ఉందండోయ్.
పోతే, ఈ సినిమాకు మేర్లపాక గాంధీ డైరెక్టర్. రామ్ మిరియాల మ్యూజిక్ డైరెక్టర్. ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లపై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.