ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోపీచంద్ "పక్కా కమర్షియల్" కు షాకింగ్ TRP

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 06:14 PM

మాచో స్టార్ గోపీచంద్, ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా జంటగా నటించిన మూడో చిత్రం "పక్కా కమర్షియల్". మారుతి డైరెక్షన్లో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సత్యరాజ్, సప్తగిరి, శ్రీనివాస్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటించారు. జూలై 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ  ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. 
థియేటర్ల నుండి త్వరగానే ఎక్జిట్ ఐన ఈ మూవీ ఆపై డిజిటల్ ఎంట్రీ, ఆ వెంటనే బుల్లితెరపై ప్రీమియర్ అయ్యింది. స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కొచ్చిన ఈ మూవీకి షాకింగ్ (3.95) TRP రేటింగ్ వచ్చింది.
థియేటర్ రన్ లో ఉసూరుమనిపించిన ఈ చిత్రం బుల్లితెరపై కూడా అదే పరిస్థితిని కొనసాగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa