ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'దొంగలున్నారు జాగ్రత్త' ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 06:59 PM

టాలెంటెడ్ అండ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కోడూరి "మత్తు వదలారా" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో "దొంగలున్నారు జాగ్రత్త" అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తుంది. సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా ఇప్పుడు దొంగలున్నారు జాగ్రత్త యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేసారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే, దొంగలున్నారు జాగ్రత్త ఒక పర్ఫెక్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌గా కనిపిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానుంది. కాల భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ అండ్ గురు ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa