బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని ఒక మాస్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు, ఈ స్టార్ హీరో తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రొమాంటిక్ సినిమాలు తీయటంలో పేరుగాంచిన గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇప్పుడు రామ్ పోతినేనితో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. స్రవంతి రవికిషోర్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తోస్తున్నాయి. రామ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజులలో మూవీ మేకర్స్ వెల్లడించనున్నారు.