ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భారతీయుడు 2' సినిమా గురించిన సాలిడ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 08:52 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'భారతీయుడు 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సినిమాను ఆగస్టులో మూవీ మేకర్స్ ప్రారంభించారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను సెప్టెంబర్ మూడవ వారంలో ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో కమల్ హాసన్ 14 భాషలలో 10 నిమిషాల డైలాగ్‌ని ఒకే షాట్‌లో చెప్పినట్లు సమాచారం. తన అద్భుతమైన నటనతో సెట్స్‌లోని ప్రతి ఒక్కరినీ కమల్ ఆశ్చర్యపరిచినట్లు లేటెస్ట్ టాక్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa