బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన కొత్త చిత్రం "బ్రహ్మాస్త్ర". ఇందులో బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కీలకపాత్రలు పోషించారు.
భారీ అంచనాల నడుమ, తీవ్ర నెగిటివిని ఎదుర్కొంటూ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి రోజున గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి నాన్ హాలిడేస్ లో విడుదలైన హిందీ చిత్రాలలో ఫస్ట్ పొజిషన్ లో నిలిచింది. లేటెస్ట్ గా ఈ మూవీ విడుదలై వారం రోజులు పూర్తి కావడంతో, ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలొచ్చేశాయి. తొలివారం బ్రహ్మాస్త్ర 300కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ధుమ్మురేపింది.