కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అరుణ్ మాతేశ్వరన్ కలయికలో రాబోతున్న సినిమా "కెప్టెన్ మిల్లర్". మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఆడియన్స్ నుండి విశేష స్పందన వచ్చింది.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో కీరోల్ ప్లే చెయ్యబోతున్నట్టు తెలుపుతూ వెల్కమ్ ఆన్ బోర్డ్ సందీప్ కిషన్ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa