టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, బాలీవుడ్ నటి మరియు గాయకురాలు షెర్లీ సెటియా జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'కృష్ణ వ్రింద విహారి'. అనీష్ ఆర్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు.
సెప్టెంబర్ 23వ తేదీన ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. రేపు అంటే సెప్టెంబర్ 20వ తేదీన సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని అధికారిక ప్రకటన చేసారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చెయ్యగా, ఈ సినిమాతో శౌర్య సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.