కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'సూర్య 42' (వర్కింగ్ టైటిల్). సూర్య కెరీర్లో 42వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ హిస్టారికల్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.
ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శిరుతై శివ డైరెక్టర్ కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పది భాషల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కాబోతున్న ఈ మూవీలో సూర్యకు జోడిగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని నటించడం విశేషం.
ఇటీవలే పూజా కారక్రమాలతో లాంఛనంగా ప్రారంభమై, ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా ఈ రోజు నుండి గోవాలో న్యూ షెడ్యూల్ ను ప్రారంభించిందని సమాచారం. దిశా పటాని, సూర్య కాంబోలో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు.