సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన "పుష్ప" సినిమా అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఎనలేని కీర్తిని, క్రేజ్ ను తెచ్చిపెట్టింది. సుకుమార్ డైరెక్షన్లో రెడ్ శాండల్ స్మగ్లింగ్ నేపథ్యంలో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక, పుష్పరాజ్ గా అల్లుఅర్జున్ కెరీర్లోనే ది బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల జరిగిన సైమా అవార్డుల్లో సత్తా చాటిన పుష్ప సినిమా మరొక అరుదైన ఘనతను సాధించింది.
మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో, ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల కేటగిరీలో ఇండియా తరఫున పుష్ప ది రైజ్ మూవీ ఎంపిక చెయ్యబడింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.