నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ చేసిన టాక్ షో "అన్ స్టాపబుల్ విత్ NBK". తెలుగు ఓటిటి ఆహాలో స్ట్రీమింగ్ ఐన ఈ షో అత్యధిక వ్యూయర్ షిప్ తో IMDB రేటింగ్స్ లో స్థానం సంపాదించుకుంది.
ఈ టాక్ షోకు వచ్చిన క్రేజ్ తో మేకర్స్ సీజన్ 2 ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే సీజన్ 2 పై బిగ్ అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. లేటెస్ట్ బజ్ ప్రకారం, సీజన్ 2 అక్టోబర్ మొదటి వారం నుండి దసరా సందర్భంగా మొదలయ్యే అవకాశం కనిపిస్తుందని టాక్. అలానే సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారని అంటున్నారు. అసలే ఈ షోపై భారీ అంచనాలుండగా, ఇప్పుడు పవర్ స్టార్ పేరు వినిపిస్తుండడంతో ఆ అంచనాలు కాస్తా ఆకాశాన్నంటుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa