ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్విట్టర్ లో వైరల్ అవుతున్న చిరు చెప్పిన డైలాగ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 11:15 PM

చిరంజీవి ఏదీ చేసిన ఓ సంచలనమే. తాజాగా ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన 10 సెకన్ల ఆడియో చర్చనీయాంశంగా మారింది. 'నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ... రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అని ఆ ఆడియోలో చిరంజీవి చెప్పారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.  మనకు రాజకీయాలు వద్దు బాస్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ఇది చిరంజీవి కొత్త సినిమా 'గాడ్ ఫాదర్' లోని డైలాగ్ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో... అసలు విషయం ఏమిటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa