స్టార్ హీరో తాలా అజిత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న AK 61 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ అయ్యాయి. కొంచెంసేపటి క్రితమే మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేసారు.
అజిత్ కెరీర్ లో 61వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'తునివు' అనే టైటిల్ ను ఖరారు చెయ్యగా, ఫస్ట్ లుక్ లో అజిత మాస్ స్టైలిష్ స్వాగ్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తున్నాయి. 'నో గట్స్, నో గ్లోరీ' అనేది ట్యాగ్ లైన్.
హెచ్ వినోద్ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. బే వ్యూ ప్రాజెక్ట్స్ , జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.