టాలీవుడ్ టాప్ సైరెన్ సమంతకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో సమంతకు లక్షల్లో ఫాలోవర్లున్నారు. వారందరిని కూడా తరచూ షూట్ చేసే ఫోటో షూట్లతో, పర్సనల్ ఇన్ఫోతో సమంత ఎంటర్టైన్ చేస్తుంటుంది. కానీ, కొన్నాళ్ల నుండి సమంత మీడియాకు చిక్కట్లేదు. సూపర్ యాక్టివ్ గా ఉండే సామ్ సోషల్ మీడియాలో అసలు కనిపించడమే మానేసింది.
వీటన్నిటికీ కారణం సమంత స్కిన్ డిసీజ్ తో బాధపడడమే అని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకే ఆమె తరచూ అమెరికాకు వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంటుందని అంటున్నారు.
ఐతే, ఈ వార్తలపై సమంత మేనేజర్ స్పందించి, వాటన్నిటిని పుకార్లని కొట్టి పారేశారు. సమంత ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి ఆమె అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. కానీ ఆమె ఎందుకు తరచూ అమెరికాకు వెళ్తుందో మాత్రం చెప్పలేదు. ఈ ప్రశ్నకు ఆయన నుండి ఎలాంటి సమాధానం రాకపోవడం సామ్ అభిమానుల్లో కలతను రేపుతోంది.