లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజుగారి ఆకస్మిక మరణంతో సలార్ షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, వచ్చే వారం నుండి ప్రభాస్ సలార్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారని వినికిడి. రామోజీ ఫిలింసిటీలో నిర్మించిన 14 భారీ సెట్లలో ప్రభాస్ పై కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించబోతున్నారట.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. రవి బస్రుర్ సంగీతం అందిస్తుండగా, హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.