ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 30నుండి 'కెప్టెన్' డిజిటల్ స్ట్రీమింగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 06:22 PM

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన చిత్రం 'కెప్టెన్'. తెలుగు, తమిళ భాషలలో సెప్టెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ విడుదలకు ముందు ఉన్న అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 
పోస్ట్ థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసిన ప్రముఖ ఓటిటి జీ 5 సంస్థ అనుకున్న సమయానికన్నా చాలా ముందుగానే ఈ మూవీని డిజిటల్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. సెప్టెంబర్ 30 నుండి కెప్టెన్ మూవీ తెలుగు, తమిళ భాషలలో స్ట్రీమింగ్ కాబోతుందని అధికారిక ప్రకటన కూడా చేసింది.
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈ చిత్రాన్ని హీరో నితిన్ డిస్ట్రిబ్యూట్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com