టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. షూటింగ్ ప్రారంభం సందర్భంగా ఇటీవల మూవీ మేకర్స్ విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో యాక్షన్ ప్యాక్ వైబ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. అన్బరివ్ కొరియోగ్రఫీ చేసిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో మూవీ మేకర్స్ చిత్రీకరించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, దసరా పండుగ తర్వాత రెండో షెడ్యూల్‌ను మూవీ మేకర్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో మహేష్ ఒక స్పెషల్ ఏజెంట్‌గా నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.