కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా 'ప్రిన్స్'. ఈ సినిమాకి తెలుగు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మారియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి "జెస్సికా" అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.