ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" నుండి సెకండ్ లిరికల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 06:06 PM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం "ఓరి దేవుడా". ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు డైరెక్టర్ కాగా, మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ అప్డేట్ వచ్చింది. అవుననవా అని సాగే ఈ పాట గ్లిమ్స్ ను రేపు సాయంత్రం 05:04 గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు న్యూ పోస్టర్ ద్వారా తెలిపారు. పోతే, ఈ పూర్తి పాట సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతుంది.
రీసెంట్గా విడుదలైన స్పెషల్ సర్ప్రైజ్ గ్లిమ్స్ తో ఒక్కసారిగా ఈ సినిమా ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాస్ప్ చేసింది. పీవీపీ సినిమాస్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa