ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గారు తాజాగా అల్లు స్టూడియోస్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో నిర్మితమవుతున్న ఈ స్టూడియోస్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేసింది.
అక్టోబర్ 1వ తేదీన అల్లు రామలింగయ్య గారి శతజయంతి సందర్భంగా ఈ స్టూడియోస్ ను ప్రారంభిస్తారని వినికిడి. మెగా కాంపౌండ్ మొత్తం ఈ స్టూడియో ఓపెనింగ్ కి రాబోతున్నారట. మెగా స్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా గ్రాండ్ లాంచ్ కాబోతున్న ఈ స్టూడియోస్ లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2" షూటింగ్ తొలి షెడ్యూల్ జరుగుతుందని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa