దాదాపు పుష్కరకాలం తదుపరి మాటల మాంత్రికుడు త్రివిక్రం - సూపర్స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, దసరా పండుగను పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్ మరియు మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవుతాయని సూపర్స్టార్ ఫ్యాన్స్ వేకళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
వచ్చే ఏడాది వేసవిలో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa