అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం ఫలితంతో స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులతో పాటు - హీరోయిన్ మార్పు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. మొదట ఈ చిత్రం కోసం పాయల్ రాజ్ పూత్ మరియు నభా నటేష్ లను ఎంపిక చేయడం జరిగింది. నన్ను దోచుకుందువటే చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ముద్దుగుమ్మ నభా నటేష్ కు తన సినిమాలో రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. అయితే ట్యాక్సీవాలా చిత్రం విడుదల తర్వాత తన నిర్ణయంను మార్చుకున్నాడని తెలుస్తోంది. ట్యాక్సీవాలా చిత్ర హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కు తన సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని రవితేజ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ట్యాక్సీవాలా చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రియాంక జవాల్కర్ కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. సక్సెస్ తో ఎంట్రీ ఇచ్చి లక్కీ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈమెను తమ సినిమాలో ఎంపిక చేసేందుకు చర్చు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఆ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రియాంక జవాల్కర్ కు ఇంకా పలు చిత్రాల్లో నటించే అవకాశాలు కూడా దక్కుతున్నాయట.