రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా రూపొందిన మూవీ భైరవ గీత..రామ్ గోపాల్ వర్మ శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వాస్తవ ఘటనలు ఆధారంగా తెరకెక్కింది. ఈ ప్రేమ కథ చిత్రంలో ధనుంజయ్, ఇర్రామోర్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. చిత్ర టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. కాగా ఈ మూవీ ఈ నెల 30వ తేదిన విడుదల కావలసి ఉంది..ఈ మూవీకి సెన్సార్ ఇబ్బందులు తలెత్తడంతో డిసెంబర్ ఏడో తేదికి వాయిదా వేశారు.. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్‌లో తెలిపాడు.. ఓటింగ్ రోజున అంటే డిసెంబర్ 7న భైరవ గీత ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవగీతకి ఓటు వేసి గెలిపించండి అని కామెంట్ పోస్ట్ చేశాడు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa