ట్రెండింగ్
Epaper    English    தமிழ்

’మారి 2’ నుంచి రౌడీ బేబి సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 28, 2018, 05:08 PM

మారి చిత్రానికి సీక్వెల్‌గా కోలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ మారి 2. ధ‌నుష్‌, సాయి ప‌ల్ల‌వి, వ‌ర‌ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. బాలాజీ మోహన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఆయ‌న సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుందని తెలుస్తుండ‌గా, చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగవంతం చేశారు . తాజాగా రౌడా బాయ్ అంటూ సాగే ఓ పాట విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌కి ప్ర‌భుదేవా కొరియోగ్రఫీ అందించారు. పోయొట్టు ధ‌నుష్ లిరిక్స్ అందించ‌గా ఢీ, ధ‌నుష్ ఈ పాట ఆల‌పించారు. ఈ సాంగ్ ధ‌నుష్ అభిమానులని ఆక‌ట్టుకునేలా ఉంది. మ‌రి తాజాగా విడుద‌లైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa