ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ "పుష్ప 2" లో కాజల్ ... ఏ పాత్రలో అంటే..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 04:45 PM

గతేడాది విడుదలైన "పుష్ప" సినిమాలోని ఐటెం సాంగ్ ఊఁ అంటావా మావా ఎంత పాపులరయ్యిందో ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన అవసరం లేదు. ఖండాంతరాలు దాటి మరీ సూపర్ పాపులరైన ఈ పాటకి టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత హాట్ హాట్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణ. అంతకుముందు ఆమె చేసిన సినిమాల కన్నా పది రేట్లు పాపులారిటీ తీసుకొచ్చింది ఈ పాట.



ముందుగా ఈ పాట కోసం సుకుమార్ అండ్ టీం చాలా మందినే అనుకున్నారట. కానీ, ఆఖరికి సమంత ఐటెం గర్ల్ గా మారి ఈ పాటలో డాన్స్ వేసి కెరీర్ లో గుర్తుండిపోయే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.



లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, వచ్చే వారం నుండి సెట్స్ పైకి వెళ్ళబోతున్న పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ రంగంలోకి దిగబోతుందట. బాబు పుట్టిన తరవాత ఇటీవలే ఇండియన్ 2 షూటింగ్ తో కాలు బయట పెట్టిన కాజల్ పుష్ప 2 ఆఫర్ ను కనక యాక్సెప్ట్ చేస్తే, ఆమె కెరీర్ లో చెయ్యబోయే రెండవ ఐటెం సాంగ్ అవుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో 'పక్కా లోకల్' కాజల్ మొదటి ఐటెం నెంబర్. ఈ పాట సూపర్ హిట్టయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com