ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో కింగ్ నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటిస్తున్న చిత్రం "ది ఘోస్ట్". ఈ చిత్రానికి భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్ లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.పోతే, ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
పోతే, వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించాల్సి ఉంది. కొన్ని రోజులు షూటింగ్ లో కూడా పాల్గొన్న కాజల్ ప్రెగ్నన్సీ కారణంగా ఘోస్ట్ మూవీ నుండి తప్పుకుందట. ఆమెను రీప్లేస్ చెయ్యడం మేకర్స్ కి కత్తిమీద సాము లాగా మారిందట. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ భీకర యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించాల్సి ఉంది మరి. ఈ నేపథ్యంలో మేకర్స్ సోనాల్ చౌహన్ ను హీరోయిన్ రోల్ కోసం అప్రోచ్ అవ్వడం, సోనాల్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ చెయ్యడం ... అన్ని జరిగిపోయాయన్న మాట.