ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవలే వారియర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాలు నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
పూరి జగన్నాధ్ తో చేసిన ఇష్మార్ట్ శంకర్ తదుపరి రామ్ అంతటి సాలిడ్ హిట్ అందుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. బోయపాటితో చెయ్యబోయే పాన్ ఇండియా మూవీ తోనైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని రామ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఐతే, ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ లేక అభిమానులు కూసింత కంగారుగా ఉన్నారు.
పూజా కార్యక్రమాలతో ఎప్పుడో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ కొన్ని ఫైనాన్సియల్ ఇబ్బందులను ఎదుర్కొంటుందట. అందుకే రెండు సార్లు షూటింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుని కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసారంట. ఈ ఇబ్బందులు త్వరలోనే తీరిపోయి, రామ్ తొలి పాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.