యంగ్ హీరో నితిన్, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన "మాచర్ల నియోజకవర్గం" ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో నితిన్ హోప్స్ అన్ని కూడా వక్కంతం వంశీతో చెయ్యబోయే అప్ కమింగ్ మూవీపైనే ఉన్నాయి.
మాచర్ల నియోజకవర్గం మూవీ విడుదలకు ముందే కొంతమేర షూటింగ్ ను కూడా జరుపుకున్న ఈ సినిమా ఇప్పటివరకు కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చెయ్యలేదు. ఇందుకు కారణమేంటంటే, ఈ మూవీ సెకండ్ హాఫ్ పై నితిన్ అసంతృప్తిగా ఉన్నాడట. వక్కంతం ను మరోసారి సెకండ్ హాఫ్ పై వర్క్ చెయ్యమని చెప్పాడట. సో, ఎప్పుడైతే బౌండెడ్ స్క్రిప్ట్ తో నితిన్ సాటిస్ఫై అవుతాడో అప్పుడు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందన్న మాట.
పోతే, ఈ సినిమాలో పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఠాగూర్ మధుతో కలిసి నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తుంది.