ఈ ఏడాది విడుదలైన చిన్న సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది సిద్ధూ జొన్నలగడ్డ నటించిన "డీజే టిల్లు". విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.
విడుదలకు ముందే సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన మేకర్స్ నిన్న రాత్రి నుండి సీక్వెల్ మూవీ షూటింగ్ ప్రారంభించారట. పోతే, సీక్వెల్ మూవీ నుండి డైరెక్టర్ విమల్ కృష్ణ, హీరోయిన్ నేహశెట్టి తప్పుకున్నారని టాక్. విమల్ ప్లేస్ ను అద్భుతం డైరెక్టర్ మల్లిక్ రామ్ రీప్లేస్ చేస్తుండగా, హీరోయిన్ విషయంలోనే సరైన క్లారిటీ రావట్లేదు. టిల్లుకు జోడిగా అనుపమ, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నప్పటికీ మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ రావట్లేదు. షూటింగ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి త్వరలోనే హీరోయిన్ ఎవరన్నది మేకర్స్ అప్డేట్ ఇవ్వొచ్చు.
ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు ప్లాన్ చేస్తున్నారట.