కొంచెంసేపటి క్రితమే ఓరి దేవుడా మూవీ నుండి సెకండ్ లిరికల్ మ్యూజిక్ వీడియో విడుదలైంది. లియోన్ జేమ్స్ స్వరపరిచిన "అవుననవా" అని సాగే ఈ బ్యూటిఫుల్ మెలోడీ సిద్ధ్ శ్రీరామ్ గొంతులో వినడానికి మరింత మధురంగా ఉంది. ఈ మధురగీతానికి సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రిగారు లిరిక్స్ అందించారు.
విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న ఈ మూవీ గతేడాది విడుదలైన సూపర్ హిట్ కోలీవుడ్ మూవీ "ఓహ్ మై కడవులే"కి అఫీషియల్ తెలుగు రీమేక్. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో కీలకపాత్రను పోషించడం విశేషం.
దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాను అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేస్తున్నారు.
![]() |
![]() |