ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మాతలను బెంబేలెత్తిస్తున్న అనుపమ కాస్ట్లీ కండిషన్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 06:48 PM

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన "కార్తికేయ 2" భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కొన్నాళ్ళబట్టి తెలుగులో మంచి ఆఫర్లు లేక ఇబ్బంది పడుతున్న అనుపమకు ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ ఇవ్వడంతో ఇప్పుడు టాలీవుడ్ లో సరికొత్త ఆఫర్లు ఆమెను వరిస్తున్నాయి.



ఈ నేపథ్యంలో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్న అనుపమ తన వద్దకొస్తున్న మేకర్స్ కు కాస్ట్లీ కండిషన్స్ పెడుతుందట. పదేళ్ల బట్టి ఇండస్ట్రీలో ఉంటున్న అనుపమ సినిమాకు కోటి మాత్రమే తీసుకుంటూ వచ్చింది. కార్తికేయ 2 తో ఫుల్ ఫామ్ లో కొచ్చిన అనుపమ లేటెస్ట్ గా తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసి, అందుకు సమ్మతమైతేనే సినిమాలో నటిస్తానని కండిషన్స్ పెడుతుందట. ఈ కండిషన్స్ తో ఇప్పటికే రెండు సినిమా ఆఫర్లను అనుపమ కోల్పోయిందట.



మరి, అనుపమ తన కండిషన్స్ ను సవరించి ఫిలిం ఆఫర్స్ ను ఒడిసి పెట్టుకుంటుందా..? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com