మహా ప్రస్థానం లో ముగిసిన ఘట్టమనేని ఇందిరా దేవి గారి అంత్యక్రియలు, అంత్యక్రియల్లో పాల్గొన్న ఘట్టమనేని కృష్ణగారి కుటుంబసభ్యులు . ఘట్టమనేని ఇందిరా దేవి ఈరోజు తెల్లవారు ఝామున కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందారు .ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు, ఘట్టమనేని సన్నిహితులు, స్నేహితులు ఇందిరాదేవిగారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు.. అశ్రునయనాల మధ్య ఇందిరాదేవికి కడసారి వీడ్కోలు పలికిన అభిమానులు