బాలీవుడ్ మోస్ట్ పాపులర్ సెలెబ్రిటీ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె. 2018లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఐతే, లేటెస్ట్ గా వీరిద్దరి మ్యారేజ్ లైఫ్ పై పలురకాల రూమర్లు వినిపిస్తున్నాయి.
దీపికా, రణ్ వీర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ లో జరిగే పార్టీలు, ఫంక్షన్స్ లో వీరి అన్యోన్యతను చూసి ఫ్యాన్స్ సంబరపడి పోయేవారు. ఐతే, వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, ఇద్దరూ కూడా మ్యారేజ్ లైఫ్ లో ప్రస్తుతం ఒడిదుడుకులను ఫేస్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
వస్తున్న వార్తల్లో ఆవగింజంత కూడా నిజం ఉండకూడదని, తమ అభిమాన జంట నిండు నూరేళ్లు సంతోషంగా కలిసుండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.