చైనాలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన Shanghai University క్యాంపస్‌లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా గుర్తింపు పొందిన Aston Martin Valkyrie హైపర్ కారులో ఓ విద్యార్థి యూనివర్సిటీ ఆవరణ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.₹27 కోట్ల విలువైన హైపర్ కారు.సుమారు ₹27 కోట్లు (దాదాపు 3.5 మిలియన్ డాలర్లు) ధర కలిగిన ఈ హైపర్ కారు అత్యంత శక్తివంతమైన మోడళ్లలో ఒకటిగా భావిస్తారు. ప్రత్యేకమైన ఏరోడైనమిక్ డిజైన్, అలాగే Formula One రేసింగ్ కార్లను గుర్తు చేసే వేగ సామర్థ్యం దీన్ని కార్ల అభిమానుల కలల కారుగా మార్చాయి.అత్యంత అరుదైన మోడల్.ప్రపంచవ్యాప్తంగా ఈ వాహనాన్ని కేవలం 150 నుంచి 275 యూనిట్ల వరకే తయారు చేసినట్లు సమాచారం. అందువల్ల ఇది సాధారణంగా కనిపించే కారు కాదు; అత్యంత అరుదైన కలెక్షన్ ఐటమ్‌గా పరిగణిస్తారు.సోషల్ మీడియాలో హల్చల్ ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ విద్యార్థి విలాసవంతమైన జీవనశైలిపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “ఇదే అసలైన రిచ్ స్టూడెంట్” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa