పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ కెప్టెన్ Sarfaraz Ahmed ను పాకిస్తాన్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ఆఫర్ చేసింది. 38 ఏళ్ల సర్ఫరాజ్ ఈ బాధ్యతను అంగీకరిస్తారా అనే నిర్ణయాన్ని PCB ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అతను అంగీకరిస్తే, పాకిస్తాన్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన టెస్ట్ ప్రధాన కోచ్‌గా రికార్డు సృష్టించనున్నారు. 2017 ICC చాంపియన్స్ ట్రోఫీలో భారతదేశాన్ని ఓడించి సర్ఫరాజ్ కెప్టెన్సీలో పాకిస్తాన్ ICC టైటిళ్లను గెలిచినది గుర్తుంచుకోదగిన ఘటనా.సర్ఫరాజ్ నియామకం పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు కొత్త దిశను తీసుకురావచ్చని PCB వర్గాలు భావిస్తున్నాయి. ఈ పదవి అక్టోబర్ 2025 నుండి ఖాళీగా ఉంది. ఆస్ట్రేలియన్ కోచ్ Jason Gillespie రాజీనామా చేసిన తర్వాత, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అజ్హర్ మహ్మూద్ ఇంటరిమ్ కోచ్‌గా వ్యవహరించారు. మే నెలలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌తో సర్ఫరాజ్ అధికారిక బాధ్యతలు ప్రారంభిస్తారని అంచనా.సర్ఫరాజ్ అహ్మద్ మాజీ కెప్టెన్‌గా 2017 ICC చాంపియన్స్ ట్రోఫీ గెలిపించి అభిమానుల మద్య గుర్తింపు పొందాడు. ఫైనల్లో భారత్‌పై 180 పరుగుల తేడాతో గెలిచిన సర్ఫరాజ్, 54 టెస్ట్ మ్యాచ్‌లలో 3,031 పరుగులు, 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు సాధించారు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ప్రసిద్ధి చెందిన అతను PCBలో యువ క్రికెట్ కోసం యాక్టివ్‌గా వ్యవహరించాడు. U-19 జట్టుకు మెంటర్/మేనేజర్‌గా పనిచేసి 2025 ACC U-19 ఆసియా కప్ గెలిపించాడు. అలాగే పాకిస్తాన్ షాహీన్స్ (A-టీమ్) మరియు U-19 జట్ల డైరెక్టర్‌గా నియమితులయ్యాడు. ఈ విధంగా PCB స్థానిక అనుభవం, లీడర్షిప్ స్కిల్స్‌పై ఆధారపడుతూ, టెస్ట్ జట్టుకు సర్ఫరాజ్ లాంటి అనుభవజ్ఞుడిని తీసుకురావడం కీలకం.తాజాగా పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ కష్టకాలంలో ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి శక్తివంతమైన జట్లతో సిరీస్‌లలో ఓటములు ఎదుర్కొన్నది తెలిసిందే. సర్ఫరాజ్ లాంటి మాజీ కెప్టెన్ రావడం రెడ్-బాల్ క్రికెట్లో డిసిప్లిన్, స్ట్రాటజీ మెరుగుదలకు, అలాగే యువ ఆటగాళ్లకు మార్గదర్శకత్వం అందించగలదు. ఫ్యాన్స్ మధ్య సరికొత్త ఆశలు కూడా కలిగాయి. PCB అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa