మెగా పవర్ స్టార్ రాంచరణ్ బ్లాక్ బస్టర్ మూవీ "ధ్రువ" సినిమాలో స్టైలిష్ అండ్ ప్రౌడ్ విలన్గా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు ఒకప్పటి రొమాంటిక్ హీరో అరవింద్ స్వామి. ఆపై మరే సినిమాలోనూ అరవింద్ స్వామి నటించలేదు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, నాగచైతన్య తొలి తెలుగు - తమిళ బై లింగువల్ మూవీలో అరవింద్ స్వామి మరోసారి తనలోని విలనిజాన్ని చూపించబోతున్నాడని టాక్.
కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూరులో జరుగుతుంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.