మోస్ట్ ఎవైటెడ్ గాడ్ ఫాదర్ ట్రైలర్ వచ్చేసింది. పోస్టర్లు, టీజర్లతో ప్రేక్షకాభిమానుల్లో ఫుల్ మాస్ స్టఫ్ నింపేసిన మెగాస్టార్ ట్రైలర్ తో మాస్ పూనకాలనే తెప్పించేసారు. 'బ్రహ్మ' గా గాడ్ ఫాదర్ మాస్ రచ్చ చేసాడు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. వెరసి... ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.
సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కాబోతుంది.
![]() |
![]() |